మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 01, మండల పరిధిలోని గుండెపుడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థిని, విద్యార్థులకు దిశా వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 14 మంది విద్యార్థులకు పరీక్షలు రాయడానికి కావలసిన మెటీరియల్ ను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో సైన్స్ బోధించే ఉపాధ్యాయురాలు కళావతిని దిశా ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. దిశ వెల్ఫేర్ ప్రొటెక్షన్ రాష్ట్ర కార్యదర్శి సీతాకుమారి మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలు బాగా రాసి, అత్యధిక మార్కులు సాధించాలని, తద్వారా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహరావు, వైస్ ఎంపీపీ గాదె నిర్మల, దిశా కమిటీ జిల్లా కో ఆప్షన్ నెంబర్ నిర్మల, సత్యవతి, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.