UPDATES  

 జానంపేట గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు

 

మన్యం న్యూస్, పినపాక :

మండల పరిధిలోని జానంపేట గ్రామపంచాయతీలో వేసవికాలం వస్తున్నందున ప్రజలకు దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటును జానంపేట సర్పంచ్ మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతూ ఎండలు విపరీతంగా ఉండటంతో ప్రజల దాహర్తి తీర్చడం కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు .ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య , పిఏసిఎస్ చైర్మన్ రవి శేఖర్ వర్మ, ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ , వెంకన్న, బోడ ఈశ్వరయ్య , పటేల్ నరసింహారావు , అయ్యప్ప రెడ్డి , బరకాల శ్రీను, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !