మన్యం న్యూస్ చండ్రుగొండ, ఏప్రిల్ 20: గత ఏడాది తునికాకు సేకరణ చేసిన కూలీలకు రావాల్సిన బోనస్ లు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దని వేణు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు తునికాకు సేకరణ ఒక ఉపాధి అవకాశం ఉంటుందని, దీనిలో కూలీలకు రావాల్సిన ఇన్సెంటీవ్ వెంటనే చెల్లించాలన్నారు. బోనస్ చెల్లింపులో జాప్యాన్ని నివాలరించాలన్నారు. గతంలో బోనస్ లు కూలీలకు ఇచ్చిన సందర్భాలు లేవని, బోనస్ చెల్లింపులపై స్పష్టమైనా విధనాన్ని అధికారులు అవలంభించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రాయి రాజా, గుర్రం వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.