మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 27, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల పరిధిలోని సూరారం గ్రామంలో ట్రాక్టర్ పల్టీ కొట్టి డ్రైవర్ మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మాలోత్ వంశి (30) అనే యువకుడు తల్లాడ సమీపంలోని అంజనాపురం గ్రామం నుంచి బతుకుదెరువు కోసం వచ్చి సూరారం గ్రామంలో గత పది సంవత్సరాలుగా తన మామయ్య దగ్గర ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ, కొంత కౌలు వ్యవసాయం చేసుకుంటూ తన భార్య ఇద్దరు పిల్లలను పోషించుకుంటు జీవనం సాగిస్తున్నాడని, ఇదే క్రమంలో గురువారం ఉదయం నాగలి దుక్కి దున్నుటకు వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాకపోగా, ఫోనులో కూడా స్పందించకపోవడంతో ట్రాక్టర్ యజమాని పొలం వద్దకు వెళ్లి చూసేసరికి ట్రాక్టర్ కిందపడి ఉండడాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో, గ్రామస్తుల సహాయంతో ట్రాక్టర్ కింద ఉన్న డ్రైవర్ వంశీని బయటకు తీసి చూడగా, అప్పటికే ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని తెలిపారు. ప్రమాదం మధ్యాహ్నమే జరిగి ఉండొచ్చని, చుట్టుపక్కల ఎవరు లేక ప్రమాదాన్ని గమనించలేదని అన్నారు. వంశీ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.