అగ్నిప్రమాద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 28::
మండలంలోని డి కొత్తగూడెం గ్రామంలో 20 రోజులు క్రితం అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన నాలుగు కుటుంబాలకు శనివారం ఆదివాసి మహిళ చైతన్య శక్తి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు వంట పాత్రలు చీరలు దుప్పట్లు బిందెలు 60 కేజీల బియ్యం పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమని మహిళ చైతన్య శక్తి ఆధ్వర్యంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పి వెంకటలక్ష్మి అనసూయ అరుణ భారతి కల్పన ధనలక్ష్మి సుశీల తదితరులు పాల్గొన్నారు.