*
మన్యం న్యూస్, మంగపేట
మంగపేట మండల బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కేశవాపురం గూడెం లో నిరుపేద విద్యార్థులకు చదువు నేర్పించేందుకు వి కేర్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిన రేకుల షెడ్డును తొలగించాలని ఫారెస్ట్ అధికారులు ఆదేశించడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. ఫారెస్ట్ ఏరియాలో పూరి గుడిసె తప్ప రేకుల షెడ్లు ఏర్పాటు చేయొద్దని వెంటనే తొలగించాలనే ఫారెస్ట్ అధికారులు ఆదేశం జారీ చేస్తే ఆ రేకుల షెడ్డు వద్దకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి నిరుపేద బాల, బాలికల కోసం తత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగిందని చదువు కోసం ఏర్పాటుచేసిన ఆ షెడ్డుకు అడ్డుపడవద్దని అధికారులతో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొంకతి సాంబశివరావు, మండల సీనియర్ నాయకులు బండ జగన్మోహన్ రెడ్డి, అయోరి యనయ్య, తదితరులు హాజరయ్యారు