UPDATES  

 రష్మిక ప్లేస్ లో శ్రీలీల..డైరెక్టర్ సెంటిమెంట్ కు బ్రేక్

శ్రీలీల..ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మారుమోగుతున్న పేరు. చిత్రసీమలోకి కొత్త హీరోయిన్ వచ్చేదంటే చాలు దర్శక, నిర్మాతల కళ్లు అన్ని ఆమెపైనే ఉంటాయి.

ఒకవేళ ఆమె నటించిన మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యి..ఆమెకు మంచి గుర్తింపు వచ్చిందంటే చాలు ఆమె కాల్ షీట్స్ కోసం నిర్మాతలు,. దర్శకులు పోటీపడతారు. ప్రస్తుతం ధమాకా ఫేమ్ శ్రీలీల (Sreeleela) పరిస్థితి కూడా అలాగే. పెళ్లి సందD మూవీ తో ఇండస్ట్రీ లో అడుగుపట్టిన ఈ చిన్నది..మొదటి సినిమాతోనే తన గ్లామర్ , డాన్సులతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ధమాకా లో ఓ రేంజ్ లో నటించి , ముఖ్యంగా డాన్స్ లతో అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత అమ్మడి జతకమే మారిపోయింది.

అగ్ర హీరోల దగ్గరి నుండి చిన్న హీరోల వరకు అంత ఈమె జపమే చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మడి చేతిలో దాదాపు డజన్ సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ కొత్త సినిమా ఛాన్స్ వస్తే లేదు అనకుండా ఒకే చెపుతుంది. తాజాగా రష్మిక ప్లేస్ లో అమ్మడికి నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల (Venky Kudumula)ప్రస్తుతం నితిన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా రష్మిక (Rashmika) ను ఎంపిక చేసాడు. వెంకీ ఫస్ట్ మూవీ నుండి ఈమెనే హీరోయిన్ నటిస్తూ వస్తుంది. రష్మిక ఉంటె ఆ సినిమా హిట్టే అని వెంకీ నమ్ముతూ వస్తున్నాడు. ఈ సినిమా లో కూడా అలాగే ఆమెనే తీసుకున్నాడు. కాకపోతే షూటింగ్ ప్రారంభం కావడానికి ఆలస్యం అవుతుండడంతో రష్మిక డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా నుంచి తప్పుకుందట. దీంతో ఆమె ప్లేస్ లో శ్రీ లీలను ఎంపిక చేశారట. ఇప్పటికే నితిన్, శ్రీలీల కలిసి ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఇంకా ఈ మూవీ పూర్తవ్వక ముందే నితిన్‌తో మరోసారి జోడీకట్టే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !