ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ డీవీ
మన్యం న్యూస్,ఇల్లందు: సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధెైర్యశాలి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, మేనేజర్ అంకుషావలి, మున్సిపల్ కౌన్సిలర్లు అంకెపాక నవీన్ కుమార్, కుమ్మరి రవీందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.