మన్యం న్యూస్, వాజేడు: వాజేడు మండలం గణపురం గ్రామానికి చెందిన కూర్సం రజిని(30) డెంగ్యూ జ్వరంతో మృతి చెందారు.మండలంలో పలు గ్రామాలలో డెంగ్యూ జ్వరాలు నమోదవుతున్నాయి . సరైన సమయంలో వైద్యం అందక డెంగ్యూ తో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. జ్వర పీడితులు వైద్యులను సంప్రదిస్తూ అప్రమత్తత గా ఉండాలని మండల ప్రభుత్వ వైద్యాధికారి సూచన చేశారు.
