మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం నెహ్రునగర్ గ్రామంలో టైల్స్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎఫ్టిడబ్ల్యు) అధ్వర్యంలో ఎస్ కె ముఖ్తార్ పాష 3వ వర్ధంతి సభను మూతి రాంబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టిడబ్ల్యు వర్కింగ్ ప్రెసిడెంట్ బి రాంసింగ్ మాట్లాడుతూ మారుమూల గ్రామం గుండాలలో జన్మించిన కా,, ముఖ్తార్ పాషన్న చదువు కొరకు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బిజిఎన్అర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి ఉద్యమంలో పని చేస్తూ తన జీవితాన్ని కార్మిక ఉద్యమానికి అంకితం చేశారని అన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుండి జాతీయ కార్యదర్శిగా ఎదిగడానికి క్రమశిక్షణ, నిబద్ధతగా జీవిస్తూ ఆదర్శ కమ్యూనిస్టుగా బతికాడని, చివరి శ్వాస వరకు పేద ప్రజల కోసమే జీవించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టిడబ్ల్యూ నాయకులు బి లింగ్యా, ఎస్ దుర్గ ప్రసాద్, సనప రాంబాబు, బుగ్గ రవు, రాజమ్మ, సత్తిబాబు, రాధమ్మ, సైదులు, పిడియస్యు జిల్లా అధ్యక్షుడు ఎ సాంబ, కోశాధికారి జె గణేష్ తదితరులు పాల్గొన్నారు.