మన్యం న్యూస్,పినపాక: అభివృద్ధి ప్రదాత పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు గెలుపు కోరుతూ గురువారం బి.ఆర్.ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు.బీ. ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల.సతీష్ రెడ్డి పిలుపు మేరకు ఈ బయ్యారం 68.వ.భూత్ ఇంచార్జ్ షేక్.జహంగీర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ముఖ్యకార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
దళిత బిడ్డలను అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్
పినపాక: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తమను అక్కున చేర్చుకునే వ్యక్తి సీఎం కేసీఆర్ అని పినపాక ఎస్సీ సెల్ నాయకులు సోంపల్లి సిసింద్రీ,తోకల సతీష్ లు అన్నారు.పినపాక దళిత వాడలో పినపాక బీ. ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు విజయం కాంక్షిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. దళిత బంధు స్కీమ్ ద్వారా రూపాది లక్షలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడయ్యారని వారు కొనియాడారు .రేగా కాంతారావు తోనే అభివృద్ధి సాధ్యమని వారన్నారు.శంకర్ ,తోకల సందీప్,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
