- సౌభాగ్య లక్ష్మితో మహిళలకు భరోసా
- కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా
- అన్ని వర్గాల సంక్షేమమే బిఆర్ఎస్ లక్ష్యం
- గడపగడప బిఆర్ఎస్ విస్తృత ప్రచారం
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని సమితి సింగారం,కూనవరం, బాంబే కాలనీ,కొమరం భీమ్ నగర్,పట్టణం పరిధి లోని వార్డులలో,శివలింగాపురం బాపనకుంట ఓసి-4 లో బిఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను,పార్టీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరిస్తూ,కారు గుర్తు కు ఓటు వేయాలని కోరారు.సీఎం కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ మేనిఫెస్టో బాగుందని,అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.కెసిఆర్ బీమా తో ప్రతి ఇంటికి ధీమా కనిపించడం జరుగుతుందన్నారు.సౌభాగ్య లక్ష్మీ పథకంతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. అన్నపూర్ణ పథకం ద్వారా పేదలందరికీ రేషన్ షాపు ద్వారా సన్నబియ్యం అందిస్తామన్నారు.మహిళా సంఘాలకు మరింత బలోపేతం చేయడం,సౌభాగ్య లక్ష్మీ పథకం మహిళలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆసరా పింఛన్లు రానున్న ఐదేళ్లలో 5 వేలు,దివ్యాంగుల పెన్షన్లు 6 వేలకు పెంచుతామన్నారు. రైతులకు రైతు బంధు 10 వేల నుండి 16 వేలకు పెంచుతామని అన్నారు.మహిళలకు గ్యాస్ సిలిండర్ 400 అందిస్తామని, ఆరోగ్యశ్రీ 15 లక్షలు పెంపు, ఇండ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు వంటి పథకాలు అమలు చేస్తామని ప్రజలకు వివరించారు.సీఎం కేసీఆర్ పరిపాలనలో పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు.ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.కళ్ళ ముందున్న సంక్షేమాన్ని,ఇంటి ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు.అభివృద్ధి,సంక్షేమ ప్రభుత్వానికి మరోసారి ఓటు వేసి,అభివృద్ధి చేసే నాయకులు రేగా కాంతారావుని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం. నరసింహారావు,ఏసిఎస్ చైర్మన్ కూర్రి.నాగేశ్వరరావు,స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,కార్యదర్శి రామిరెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్,పార్టీ ముఖ్య నాయకులు,యాదగిరి గౌడ్ వట్టం రాంబాబు,సీనియర్ నాయకులు,ఓబి యూనియన్ అధ్యక్షులు రామకోటి, యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,రుద్ర వెంకట్,పార్టీ కార్యకర్తలు,యువజన నాయకులు,బిఆర్ఎస్వి నాయకులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.