మన్యం న్యూస్,మణుగూరు: మండలంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి రేగాసుధమ్మ శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పగిడేరు, రాజీవ్ గాంధీ నగర్, టేకు చెట్ల బజార్ లో పలువురి ఆహ్వానం మేరకు ఆయా ప్రాంతాలలో ప్రజలతో మమేకమై వారిని ఆత్మీయంగా పలకరించారు. మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో పలువురు రోగులను పరామర్శించి వారికి ధైర్యం నూరి పోశారు.