మన్యం న్యూస్ చర్ల:
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం పట్ల టిడిపి జిల్లా నాయకులు కొత్తపల్లి రామాంజనేయులు, మండల అధ్యక్షులు యడారి సత్యనారాయణ, నాయకులు నల్లూరి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ ఇపుడు బెయిల్ ఎలా వచ్చిందో భవిష్యత్తులో చంద్రబాబు నిర్దోషిగా కేసు నుంచి బయటపడతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రెగ్యులర్ బెయిల్ మంజూరు పట్ల ఆనందం వ్యక్తంచేస్తూ సాయంత్రం అంబేద్కర్ సెంటర్లోని టిడిపి కార్యాలయం నుంచి మొదలై బస్టాండ్, గాంధీసెంటర్, పోలీస్స్టేషన్ సెంటర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిమలమర్రి మురళి, తోటమళ్ళ వరప్రసాద్,తాడికల లాలయ్య,సత్యనారాయణ,యలం రమేష్,వాసు,లోహిత్ , తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.