భద్రాది గడ్డపై సిపిఎం, కాంగ్రెస్ పార్టీలకు నియోజకవర్గ ప్రజలు స్వస్తి పలికి తొలిసారిగా గులాబీ జెండాకు పట్టిన తెల్లం వెంకట్రావు గెలిపించారు. నవంబర్ 30వ తారీకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు 4280 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య పై గెలుపొందారు. ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. అదే విధంగా నా గెలుపు కొరకు రాత్రి పగలు శ్రమించిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులకు, మండల అధ్యక్షు కార్యదర్శులకు, ముఖ్యంగా కార్యకర్తలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి తాత మధు, సీనియర్ నాయకులు, మానే రామకృష్ణ, కోటేరు శ్రీనివాస్ రెడ్డి, కాకి అనిల్, ఆలం ఈశ్వర్,బోల్ల వినోద్,రామగిరి అరుణ్, సోషల్ మీడియా ఇంచార్జ్ పంజా రాజు తదితరులు పాల్గొన్నారు.