UPDATES  

 భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం..

  • భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే
  •  మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు
  •  భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం
  •  కొత్తగూడెం సెగ్మెంట్లో ఎగిరిన ఎర్రజెండా
  •  సంతోషంలో నాయకులు కార్యకర్తలు

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరిగిన హోరాహోరీ పోరులో కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు పట్టం కట్టారు. ఆదివారం పాల్వంచ పట్టణ పరిధిలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులతో పాటుగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి, సిపిఐ పార్టీ అభ్యర్థి విజేతలుగా నిలబడ్డారు. హోరాహోరీగా జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపొందడం జరిగింది. పినపాక నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రేగా కాంతారావుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు గెలుపొందారు. ఇల్లందు నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి హరిప్రియ నాయక్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య విజేతగా నిలిచారు. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదెం వీరయ్యపై భారత రాష్ట్ర సమితి అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపొందారు. అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారే ఆదినారాయణ విజేతగా నిలిచారు. గెలుపొందిన విజేతలకు రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేయడం జరిగింది. వారికి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థుల గెలుపు పట్ల పార్టీ నాయకులు కార్యకర్తలు సంతోషంలో మునిగితేలారు. అసెంబ్లీ ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లి విరిసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !