మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి మండల పరిధిలోని ములుగుగూడెం, అంబేడ్కర్ నగర్, రాంపూర్ గ్రామాల్లో పర్యటించి అకాల వర్షాలను నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు తక్షణమే పంట నష్టపోయిన రైతులను కలిసి వివరాలను తెలుసుకొని నష్టపరిహారం అదే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అకాలంగా కురిసిన ఈ వర్షం వల్ల రైతుల పెద్ద ఎత్తున నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో ఒక్కసారిగా తుఫాన్ తాకిడికి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని అన్నారు. రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, పంట నష్టపోయిన రైతులకు ఏకరానికి 50000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు అమర్లపుడి అజయ్, పులిచర్ల వెంకటేశ్వర్లు, వేముల మరేశ్వరారావు, వంగా చెన్నరావు, చిల్లపల్లి వెంకటేశ్వర రావు, దోమందుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.