మన్యం న్యూస్, మంగపేట.
రాజుపేట ఉన్నత పాఠశాలలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు జైహింద్ నినాద సృష్టికర్త నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావుల భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్ర లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందని, భారత దేశ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి, భారతదేశానికి మొదటిసారిగా ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పాటుచేసిన గొప్ప వ్యక్తి, బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీరుడు 16 సార్లు బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసిన మొక్కవోని ధైర్యంతో యువకులలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సుభాష్ చంద్రబోస్, అటువంటి మహానుభావులు మనకు ఆదర్శం అటువంటి వారిని అను నిత్యం స్మరణ చేసుకోవాలి.ఆయన మరణం కూడా ఎవరికీ అంతు పట్టని చిక్కుముడి గా మిగిలి పోయిందని రాజుపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు.