బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ బూట్ కట్ బాలరాజు’ అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చాడు. ఉహించినంత రెస్పాన్స్ సినిమాకు రాకపోవడంతో సోహెల్ మీడియా వేదికగా కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రేక్షకులు సినిమాను చూడాలని వేడుకున్నారు. ఎంతో కష్టపడి తీశామని, సినిమా చూసి సంతోషంగా నవ్వుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సినిమాకు ప్రేక్షకులు మద్దతు తెలపాలని వేడుకున్నారు.
