జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి సెటైరికల్ ట్వీట్ చేశారు. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లను మాత్రమే టీడీపీ కేటాయించడాన్ని ఎద్దేవా చేశారు. పవన్కు తన రాజకీయ స్థాయిపై నమ్మకం లేదని పేర్కొన్నారు. ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ అయిన తర్వాత. ఆయన తర్వాతి సినిమా కూడా ఎక్కువ థియేటర్లలోనే విడుదలయిందని. కానీ, రాజకీయాల విషయంలో పవన్ దీనికి విరుద్ధంగా వ్యవహరించారని RGV సెటైర్ వేశారు.