యానిమల్’ సినిమాపై సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను మళ్లీ మళ్లీ చూడడానికి ఇష్టపడుతున్నారంటే. వారి ఆలోచన విధానం ఎలాంటిదో గుర్తించాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమాల్లో చూపించినవే బయట జరుగుతున్నాయని ఖుష్బూ వెల్లడించారు.