వేసవి సమీపిస్తుండటంతో వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక మూగజీవాలు వాహనాల కింద తలదాచుకుంటాయని, వాహనం తీసే సమయంలో ఓ సారి చెక్ చేయండని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. అలాగే, సెలవులు కావటంతో పిల్లలు ఇంట్లో ఉంటారని, కాలనీల్లో వాహనం నడిపే సమయంలో పిల్లల కదలికలను చూసుకోవాలని సూచిస్తున్నారు.