‘ఇనిమేల్’ ఆఫర్‌ను తొలుత లోకేశ్ కనగరాజ్ తిరస్కరించారని శ్రుతిహాసన్ చెప్పారు. ’’అతనికి ‘ఇనిమేల్’లో రోల్ ఆఫర్ చేశా. వెంటనే ఆయన నో చెప్పారు. చివరకు కాన్సెప్ట్ విని ఓకే అన్నారు. చాలా చక్కగా నటించారు’’ అని తెలిపారు. ’’మొదట నేను ‘నో’ చెప్పా. పాట విన్నాను ఒక్కసారి ప్రయత్నిద్దామనుకున్నా’’ అని లోకేశ్ కనగరాజ్ అన్నారు. రేపు ఈ స్పెషల్ ఆల్బమ్ విడుదల కానుంది. కమల్ హాసన్ లిరిక్స్ అందించగా, శ్రుతిహాసన్ కంపోజ్ చేశారు.