మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ కు సంబంధించిన మార్కెట్ ఆశీలు, పశువుల సంత, పంచాయతీ కాంప్లెక్స్ సంబంధిత వేలంపాట పంచాయతీ సెక్రెటరీ కుంచం కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఎంతో ఉత్కంఠ భరితంగా ఈనెల 20 గురువారం నాడు మొదలైన ఈ వేలంపాట ప్రభుత్వ మద్దతు ధర పాట చేరుకోకపోవడం తో వాయిదాల అనంతరం మంగళవారం నాడు వివిధ ఆశిలకు సంబంధించి అర్హులైన ఎస్టీ లబ్ధిదారులు వేలం పాట ద్వారా ఆశీలు దక్కించుకున్నారు. మార్కెట్ ఆశిలను ఇర్ప సర్వేశ్వరరావు మూడు లక్షల 80 వేల రూపాయలకు పాట ద్వారా దక్కించుకున్నారు. అదేవిధంగా పశువుల సంత వేలంపాటను 24 లక్షల 80 వేలకు గంధం రవి పొందారు. కాంప్లెక్స్ రూములు కూడా పాట ద్వారా అర్హులైన అభ్యర్థులు పొందారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ ఆలీ హజరత్, ఎంపీపీ కోదండ రామయ్య, కంప్యూటర్ ఆపరేటర్ ఇసాక్, పంచాయతీ సిబ్బంది , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.