ఇటీవలే బెంగళూరులో నీటి సంక్షోభం ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదే తరహాలో హైదరాబాద్లో కూడా నీటి కొరత ఏర్పడే అవకాశమున్నట్లు హైదరాబాద్ జలమండలి బోర్డు వెల్లడించింది. తగినంత వర్షపాతం లేకపోవడం వల్ల భూగర్భజలాలు క్షీణించడంతో బోరు బావులు ఎండిపోతున్నాయని చెప్పింది. దీనిని అధిగమించేందుకు మే నాటికి నీటి ట్యాంకర్ల సంఖ్యను 700 నుంచి 838కి పెంచాలని, అవసరమైతే మరిన్ని చేర్పులు చేయాలని బోర్డు యోచిస్తోంది.
