UPDATES  

 నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్..

మన్యం న్యూస్ చర్ల:

మేము సైతం కార్యక్రమంలో భాగంగా చర్ల మండలంలోని వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా తమ తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించేందుకు గాను సుమారుగా చర్ల పోలీసు వారికి 9.5 లక్షలు అందజేశారు.నేరాల నియంత్రణ కొరకు మండలంలో మొత్తం 54 సీసి కెమెరాలను ఏర్పాటు చేసి చర్ల పోలీస్ స్టేషన్లో వీటికి సంబంధించిన కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేయడమైనది. దీని ప్రారంభాన్ని శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ చేతుల మీదుగా ఈ కమాన్ కంట్రోల్ ను ప్రారభించారు.నేరాల నియంత్రణలో భాగంగా తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో పాత్ర వహించిన చర్ల మండల వ్యాపారస్తులకు,ప్రజలకు ఈ సందర్బంగా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, 51 బి ఎన్ సి ఆర్ పి ఎఫ్ అడిషనల్ కమాండెంట్ సునీల్ కుమార్,141 బి ఎన్ సి ఆర్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్,చర్ల సిఐ రాజు వర్మ, దుమ్ముగూడెం సీఐ అశోక్ మరియు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్,రమేష్, అశోక్ రెడ్డి,ముత్యం రమేష్, ఎస్సైలు నర్సిరెడ్డి, సూరి, శేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !