UPDATES  

 తల్లిని మించిన అందం…సీనియర్ నటి గౌతమి కూతురు

సీనియర్ నటి గౌతమి తెలుసు కదా. అప్పట్లో అంటే 80స్ లో తను చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళం, తెలుగు భాషల్లో చాలా సినిమాల్లో తను హీరోయిన్ గా నటించింది. సౌత్ ఇండస్ట్రీలోనూ తనకు మంచి గుర్తింపు లభించింది. తమిళం, తెలుగు భాషల్లో ఉన్న అగ్ర హీరోలు అందరితో నటించి అందరి మెప్పు పొందింది గౌతమి. అయితే.. సినిమా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. తన వ్యక్తిగత జీవితం మాత్రం అంత బాగా లేదు. ఎందుకంటే.. సందీప్ భాటియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ కొన్ని కారణాలతో విడిపోయారు. 1998 లో వాళ్ల పెళ్లి అయింది. కానీ.. ఒక సంవత్సరం మాత్రమే ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత తమిళ్ స్టార్ నటుడు కమల్ హాసన్ తో ఆమె రిలేషన్ షిప్ లో ఉంది. దాదాపు 20 ఏళ్లు గౌతమి… కమల్ హాసన్ తో సహజీవనం చేసింది.

ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ప్రస్తుతం కమల్ హాసన్ తోనూ ఎలాంటి రిలేషన్ షిప్ లో లేదు గౌతమి. ప్రస్తుతం తన కూతురుతోనే గౌతమి ఉంటోంది. కమల్ హాసన్ తోనూ విడిపోయిన గౌతమి తన మొదటి భర్తకు పుట్టిన సుబ్బలక్ష్మితోనే గౌతమి ఉంటోంది. అయితే.. గౌతమి ఎంత అందగత్తెనో అందరికీ తెలిసిందే. అలాగే.. తన కూతురు సుబ్బలక్ష్మి కూడా అంతే అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే తన తల్లి గౌతమి కంటే కూడా సుబ్బలక్ష్మి పది రెట్లు ఎక్కువ అందంగా ఉంటుంది. అయితే.. తన కూతురును ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు గౌతమి. మరి.. తనకంటే అందంగా ఉన్న తన కూతురును గౌతమి సినిమాల్లో నటింపజేస్తుందా? లేక వేరే ఫీల్డ్ లోకి పంపిస్తుందా? అనేది మాత్రం తెలియదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !