UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 మంగ్లీకి దక్కిన అరుదైన గౌరవమే… ఎన్నో త్యాగాలు

ఫోక్ సింగర్ గా పేరు సంపాదించుకుంది మంగ్లీ. తనదైన స్టైల్ లో సినిమాల్లో క్లాస్ మాస్ పాటలు పాడుతూ యువకులను ఊపేస్తుంది. కేవలం సినిమా పాటలు మాత్రమే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్, భక్తి పాటలు పొలిటికల్ పరంగా లీడర్స్ని ప్రమోట్ చేయడానికి పాటలు పాడుతుంది. ఇప్పటివరకు మంగ్లీ పాడిన పాటలన్నీ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాయి. అంతేకాకుండా స్టార్ సింగర్స్ కి మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటుంది మంగ్లీ. అయితే రీసెంట్ గా ఏ సింగర్ కి దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది మంగ్లీ. ఆంధ్రప్రదేశ్లో సింగర్ మంగ్లీ కి కీలక పదవి లభించింది. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా మంగ్లీ నియమితులయ్యారు. ఈ పదవికి సంబంధించిన ప్రాసెస్ ఎప్పుడో పూర్తయింది. టీటీడీ మార్చి నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది.

మంగ్లీ నాలుగు రోజుల క్రితమే ఎస్విబిసి ఛానల్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో ఆమె రెండేళ్ల పాటు కొనసాగున్నారు. నెలకు లక్ష రూపాయల వేతనం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. నిజంగా ఇది మంగ్లీకి దక్కిన అరుదైన గౌరవమే.  కాని మంగ్లీకి ఈ పదవి రావడం వలన ఎన్నో త్యాగాలు చేసిందని ఆమెకు ఇష్టమైన ఫోక్ సాంగ్లను వదులుకుందని ఓ వార్త క్రేజీగా మారింది. కొందరైతే మంగ్లీ తన గొంతును అమ్మేసుకుందని పాటలు పాడ లేదని, పొలిటికల్ పరంగా ఆమెను బాగా వాడుకుంటున్నారని అంటున్నారు. ఏది ఏమైనా సరే అన్ని తెలివితేటలు ఉన్న మంగ్లీ అలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటని మండిపడుతున్నారు. ఏదేమైనా సరే మంగ్లీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తన కెరీర్ ను ఇంతటి దాకా తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ లను వదలకుండా ఆమె కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు మరి మంగ్లీ ఏం చేస్తుందో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !