జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎంపిక..
నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే పోదెం వీరయ్య..
మన్యం న్యూస్ : జూలూరుపాడు, నవంబర్ 23, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా బొడ్డు కృష్ణయ్య, ఉపాధ్యక్షులుగా లాకావత్ లచ్చు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాపలమడుగు నరసింహారావు, అడ్వైజర్ కమిటీ మెంబర్ గా ముత్తినేని రామయ్య లను నియమిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య తన క్యాంపు కార్యాలయంలో బుధవారం వీరికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విస్తరణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. తమకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, అల్లడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.