ఏపీలో మత పిచ్చి ముదరి పాకానపడినట్టు కనిపిస్తోంది. విశాఖ కేంద్రంగా ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ట్రాఫిక్ చలాన్ల మీద ఏసు క్రీస్తు ప్రబోధాలు ఉండడం చూస్తే మతం ప్రచారం పరాకాష్టకు చేరిందని అర్థం అవుతోంది. స్థానికంగా ఉండే బీజేపీ నేతలు నిలదీయడంతో పోలీసులు నాలుక్కరుసుకున్నారు. క్రీస్తు బోధనలతో ఉండే రసీదుల జారీపై వాళ్లు కుంటిసాకులు చెప్పడం గమనార్హం. విశాఖ రైల్వే స్టేషన్ ఆవరణలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మత ప్రచారం వ్యవహారం బయటపడింది. ఆటో లకు జారీ జారీ చేసిన రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ముద్రించి ఉన్నాయి. వాటిని కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై విమర్శలతో పాటు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగింది. విశాఖ పోలీసులు ఈ రసీదుల జారీపై స్పందించారు. .
ఎప్పుడూ రసీదు పుస్తకాలు ముద్రించి ఇచ్చే వారి నుంచి తమ సిబ్బంది ఓ పుస్తకం తెచ్చారని, వాటిపై ఏసు బోధనలు ఉండడం చూశాక వెంటనే ఆపేశామని ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ హరీవుల్లా వివరణ ఇవ్వడం కొసమెరుపు. గతంలో కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ప్రచారంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు వారి సంస్థల పేరుతో ఉన్న రసీదులు సరఫరా చేసేవి. అయితే, ఇప్పుడు జారీ చేసిన రసీదులపై ఆయా సంస్థల పేర్లకు బదులుగా ఏసుక్రీస్తు బోధనలు ఉండడం గమనార్హం. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన 2019 వ సంవత్సరంలో తిరుమల బస్సు టిక్కెట్ల వెనుక జెరూసలెం ప్రచారం ఉంది. ఆ విషయాన్ని గమనించిన హిందూ సంస్థలు రివర్స్ కావడంతో వాటిని ఆపేశారు. ఇప్పుడు మళ్లీ ట్రాఫిక్ చలాన్ల వెనుక ఏసుక్రీస్తు బోధనలు ఉండడం రాజకీయ వివాదానికి దారితీస్తోంది.