బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ వెలుగులోకి వచ్చారు. ఇక అనసూయ, రష్మీ కూడా ఈ షో ద్వారానే మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. అయితే అనసూయ వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో కొత్త యాంకర్ సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె తన అందంతో పాటు చలాకీ మాటలతో ఎంతగానో అలరిస్తుంది. అయితే కన్నడ బ్యూటీ కావడంతో అమ్మడు అందాలను ప్రతి ఒక్కరు గుచ్చి గుచ్చి చూస్తున్నారు. అయితే జబర్దస్త్ లోనిటాప్ కమెడియన్ కొత్త యాంకర్ సౌమ్యతో కాస్త అసభ్యంగా ప్రవర్తించినట్టు వార్తలు వస్తున్నాయి. సౌమ్య… వచ్చి మూడు వారాలు అయినా కాకముందే సౌమ్య ఫోన్ నెంబర్ తీసుకోవడం ..ఆమెతో చాటింగ్ చేయడం ..డిన్నర్ కి వెళ్దాం అంటూ ఫోర్స్ చేయడం ..అంతేకాదు స్కిట్ అయిపోయాక ఆమెతో రాసుకొని పూసుకొని తిరుగుతూ ఆమెని చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడట.
ఈ విషయం తెలుసుకున్న మల్లెమాల ఆ టాప్ కమెడియన్ కు ఫుల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట . స్కిట్స్ చేసుకొని ఎవరి పని వాళ్ళు చూసుకుంటే అందరికి మంచిది, .. Jabardasth comedian mis behave with Anchor Sowmya Rao Anchor Sowmya Rao : ఇలా ఇద్దరికి మంచిది కాదు..! లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసుకుంటే మీరే నష్టపోతారు అంటూ వారిద్దరికి చెప్పి పంపించారట. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక సౌమ్య రావు విషయానికి వస్తే.. కర్ణాటకలోని శివమొగ్గలో 1990 సెప్టెంబర్ 29న జన్మించింది. బెంగళూరులో చదువు పూర్తి కాగానే ఓ కన్నడ న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా చేసింది. అనంతరం మోడల్‌గానూ రాణించింది. నటనపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నించి..’పట్టేదారి ప్రతిభ’ అనే కన్నడ సీరియల్‌తో బుల్లితెరకు ఇంట్రడ్యూస్ అయింది. ఆ సీరియల్ హిట్ కావడం.. తన నటనకు మంచి గుర్తింపు లభించడంతో తమిళ టీవీ సీరియల్స్‌లోనూ చాలా అవకాశాలు వచ్చాయి. ఎక్కువగా విలన్ పాత్రలు పోషించింది సౌమ్య.