UPDATES  

 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. కాగా రాకెట్ నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. కాగా నేడు 11.56 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ54/ఈఓఎస్-06 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. రాకేట్ నిర్దేశిత కక్ష్యలోకి వెళ్లిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. మరికొద్దిసేపట్లో అన్ని ఉపగ్రహాల ను ఆయా నిర్దేశిత ప్రాంతాలకు చేరనున్నాయి. కాగా ఈ ఏడాది ఇస్రో చేపట్టిన చివరి ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పీఎస్ఎల్వీ-సీ54/ఈఓఎస్-06 ప్రయోగం ద్వారా మొత్తం 9 ఉపగ్రహాల ను నింగిలోకి పంపారు. ఇందులో 960 కేజీల ఓషన్ శాట్-3 తో పాటు మరో 8 నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇందులో భూటాన్ కు చెందిన శాటిలైట్ భూటాన్ శాట్ కూడా ఉంది. కాగా శుక్రవారం ఉదయం 10.26 నిమిషాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.

ఇస్రో చైర్మన్ సోమనాథ్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ము గంరాజరాజన్ ఈ కౌంట్ డౌన్ ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం రాకెట్ లోని నాల్గో దశలో ఇంధనాన్ని నింపారు. అనంతరం రాకెట్ కు సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహించి రాత్రి 10 గంటలకు రెండో దశకు ఇంధనాన్ని ఫిల్ చేశారు. ఇక రాకెట్ ప్రయోగానికి ముందు చెంగాళమ్మ దేవాలయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఇస్రో చైర్మన్ గత నెలలో విఫలమైన ఎస్ఎస్ఎల్వి డీ-1 రాకెట్ ప్రయోగాన్ని కూడా ప్రయోగించనున్నటు తెలిపారు. 2023 ఫిబ్రవరిలో పీఎస్ఎల్వీ మార్క్ -3 రాకెట్ ద్వారా 36 ఉపగ్రహాలు నింగిలోకి పంపుతామని ఇస్రో చైర్మన్ తెలిపారు. అయితే ఈ పీఎస్ఎల్వీ సీ-54 ప్రయోగం వల్ల వాతావరణానికి సంబంధించి అంశాలను ముందుగా తెలుసుకోవచ్చు. సముద్ర మీద వాతావరణం గురించి అధ్యయనం చేసుకోవచ్చు. అలాగే సైక్లోన్ లను ముందుగా పసిగట్టవచ్చు. నీటి వనరుల అంచన, వాతావరణానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు. రాకెట్ విజయవంతం కావడంతో ప్రధాని మోడీ సహా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !