పినపాక నియోజకవర్గానికి కేసీఆర్ గిఫ్ట్
రూ.100కోట్లు మంజూరు
చరిత్ర సృష్టించిన రేగా కాంతారావు
ఇక పినపాక నియోజకవర్గానికి మహర్ధశ
రేగా నిజాయితీకి కేసీఆర్ బహుమానం
(మన్యంన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్ )
పినపాక నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100కోట్ల గిఫ్ట్ ఇచ్చారు. సీఎం ప్రత్యేక నిధి నుండి రూ.100కోట్ల నిధిని మంజూరుచేస్తూ శనివారం రాత్రి ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. మణుగూరు బస్టాండ్ ఆధునీకరణ, మోడల్ బస్టాండ్, కల్వర్టుల నిర్మాణం, రోడ్లు, మోడల్ మార్కెట్లు, మొత్తం 31 పనులకు రూ.100కోట్లు సాధించి రేగా కాంతారావు మునుపెన్నడూ లేని సరికొత్త అభివృద్ది చరిత్రను లిఖించారు. భారీ ప్రణాళికలు రూపొందించడం, వాటిని సాధించడం కేవలం రేగాకు మాత్రమే సాధ్యమని మరోసారి నిరూపించారు. కేంద్రం కుట్రలను ఎదిరించి, నిజాయితీగా ప్రభుత్వపక్షాన నిలబడ్డ రేగా కాంతారావుకు, ఎన్నుకున్న ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ది నజరానా అందించారు. మరోసారి గెలుపుకు రాచబాట మలిచారు. రోడ్లు, కల్వర్టులు, ప్రజోపయోగపనులకు ఇలా ఒకేసారి నేరుగా సీఎం ప్రత్యేక నిధి నుండి 100కోట్లు సాధించడం నియోజకవర్గ చరిత్రలో ఇదే ఫస్ట్. తన దూరదృష్టి భారీ నిధులు సాధించి.. ఔరా అనిపించారు. రేగా సాహసానికి కమిట్ మెంట్ కు ఉద్దండనేతలే ఆశ్చర్యపోతున్నారు. నిధులు సాధించిన రేగాను అభినందనల్లో ముంచెత్తుతున్నారు.