UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 టిడిపి నాయకులుఎంపీటీసీ సంధాని గుండెపోటుతో అకాల మృతి

టిడిపి నాయకులుఎంపీటీసీ సంధాని గుండెపోటుతో అకాల మృతి
*నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ రేగా, ఎమ్మెల్సీ తాతా మధు, మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్
మన్యం న్యూస్ గుండాల: తెలుగుదేశం పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి గుండాల ఎంపిటిసి సంధాని అకాల మృతి చెందారు. శనివారం గుండాల నుండి కొత్తగూడెం వెళ్లే క్రమంలో మార్గమధ్యలో గుండెపోటు రావడంతో కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపే మృత్యువాత గురయ్యారు. విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్ గుండాలకు చేరుకొని ఎస్.కె సంధాని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ గత స్థానిక సంస్థల ఎన్నికలలో గుండాల ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందారు. గెలిచిన నాటినుండి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనలను పొందుతున్నారు. ప్రజల సమస్యల పట్ల ముందుండి వాటిని ప్రజాప్రతినిధులకు అధికారులకు చేరవేసి వాటిని పరిష్కరించే విధంగా ఎంతో కృషి చేసేవారు. ప్రజల మనలను పొందుతూ ప్రజాసేవలో ముందుండి నాయకుడిని కోల్పోయామంటూ పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు భావోద్వేగంతో సందానితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
*మంచి ఆత్మీయున్ని కోల్పోయాం ప్రభుత్వ విప్ రేగా: మంచి ఆత్మీయ ని కోల్పోయామని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సందాని మరణ వార్త తెలుసుకున్న ఆయన గుండాలకు చేరుకొని సంధాని పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు
*ప్రజా సమస్యల కోసం పోరాడేవారు ఎమ్మెల్సీ తాత మధు: సందాని ప్రజా సమస్యల కోసం ముందుండి పోరాడేవారని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. గుండాల గ్రామానికి చేరుకుని సంధాని పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు
*అందరిని ఆత్మీయంగా పలకరించేవారు ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్: అందరిని ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని అలాంటి మనిషి మన మధ్యలో లేకపోవడం బాధాకరం అన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !