ఉదయాన్నే చాలా మంది తమ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటారు. జిమ్‌కి వెళ్లేవారు.. ఆరోగ్యానికి ప్రాధన్యతనిచ్చే వారు కచ్చితంగా తమ డైట్లో ప్రోటీన్‌కి చాలా పెద్ద పీట వేస్తారు. మీరు కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అయితే.. మీ డైట్లో బాదం, చికెన్ మోమోస్లను యాడ్ చేసుకోవచ్చు. ఇవి విభిన్నమైన, రుచికరమైన టేస్ట్‌ని ఇవ్వడంతో పాటు.. సులభంగా తయారు చేసుకోగలిగే ఓ వంటకం ఇది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
చికెన్ – 250 గ్రాములు (బోన్ లెస్) * వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి) * క్యారెట్ – 1 (సన్నగా తరగాలి) * స్ప్రింగ్ ఆనియన్ – 3 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి) * అల్లం – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి) * సోయా సాస్టర్ – 1 టేబుల్ స్పూన్ * నూనె – డీప్ ఫ్రైకీ తగినంత * బాదం – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి) తయారీ విధానం చికెన్ ఓ గిన్నెలో తీసుకుని సన్నగా తరగాలి. దానిలో బాదం తప్పా.. మిగిలిన పదార్థాలన్నీ వేసి సమాన పరిమాణంలో ఉండే బాల్స్‌గా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ బాల్స్‌ను సన్నగా తరిగిన బాదంపప్పులో రోల్ చేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న వాటిని.. ఒక greased ప్లేట్లో జాగ్రత్తగా ఉంచి.. స్టీమర్ మీద 15 నిమిషాల పాటు ఉడికించాలి. వేడి సమానంగా ఉంచుతూ.. ఆవిరి మీద ఉడికనివ్వాలి. అనంతరం వీటిని కాస్త ఫ్రై చేసుకుని.. గోల్డెన్ కలర్ వచ్చాక దించేసుకోవాలి. వీటిని మీకు ఇష్టమైన కెచప్‌తో లేదా గ్రీన్ చట్నీతో సేవించవచ్చు. మీ ఫుడ్‌లో నూనె వద్దు అనుకుంటే.. వీటిని ఉడికించిన వెంటనే ఫ్రై చేయకుండా కూడా హ్యాపీగా తినేయవచ్చు.