హిట్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇప్పుడు సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హిట్ మూవీలో విశ్వక్సేన్ లీడ్ రోల్ ప్లే చేయగా.. హిట్ 2లో అడివి శేష్ మరో కేసును పరిష్కరించడానికి వచ్చాడు. ఈసారి ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే పనిలో శేష్ ఉన్నాడు. అయితే ఆ కిల్లర్ ఎవరు అన్నది మాత్రం ఇప్పటి వరకూ తెలియలేదు. ఈ మూవీ ట్రైలర్లో హిట్ 2లో లీడ్ రోల్, ఫిమేల్ లీడ్, ఇతర క్యారెక్టర్లు అందరినీ చూపించినా.. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అన్నది మాత్రం మేకర్స్ చూపించలేదు. ఇది ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. చివరికి మూవీ రిలీజ్‌కు కూడా టైమ్ దగ్గర పడింది. శుక్రవారమే (డిసెంబర్ 2) హిట్ 2 మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలీజ్‌కు ఒక రోజు ముందే ఆ విలన్ ఎవరో చూపించాలని మేకర్స్ నిర్ణయించారు. గురువారం (డిసెంబర్ 1) సాయంత్రం 6.03 గంటలకు ఆ సీరియల్ కిల్లర్ ఎవరో వెల్లడించనున్నారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అయిన కేడీ ఎవరి వెనుక పడుతున్నాడో కాసేపట్లో తేలిపోనుంది. సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు ఇలా విలన్‌ను రివీల్ చేయడం ప్రమోషన్లో భాగమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. హిట్ 2 మూవీలో అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి నటించింది. వీళ్లకు తోడు రావు రమేష్, కోమలీ ప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను నాని తన వాల్ పోస్టర్ బ్యానర్లో సమర్పిస్తున్నాడు.