స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో తన క్రేజ్ పాన్ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాకు తన లుక్స్‌తో పాటు నటనలో వైవిధ్యం చూపిస్తున్న స్టైలిష్ స్టార్ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. అతడితో కలిసి పనిచేసేందుకు స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ దర్శకుల సైతం ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కూడా చేరిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయాలని ఉందని తన మనస్సులో మాట బయటపెట్టేశాడు. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అతడు తెరకెక్కించిన సర్కస్ ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోహిత్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దక్షిణాది నటీనటుల గురించి ప్రస్తావన రాగా.. ఆయన ఎవరెవరితో సినిమా తీయాలని ఉంటుందో పంచుకున్నారు.
“నాకు దక్షిణాది స్టార్లలో అందరితోనూ సినిమా చేయాలని ఉంది. మరీ ముఖ్యంగా అజిత్, విజయ్, అల్లు అర్జున్, కార్తితో పనిచేయడం చాలా ఇష్టమని చెప్పారు. ఎప్పటికైనా వారితో సినిమా చేస్తాను” అని స్పష్టం చేశారు. పుష్ప చిత్రంతో పాన్ఇండియా సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ అయిన పుష్ప-2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతానికి పుష్ప-2 చిత్రీకరణ దశలో ఉండగా.. త్వరలోనే ఈ సినిమా అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృందం. నవంబరు 13 నుంచి బ్యాంకాక్‌లో మొదటి షెడ్యూల్ జరగనుంది. మరోపక్క రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ అనే ట్రైలర్ అలరిస్తోంది. రణ్‌వీర్ సింగ్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈమెతో పాటు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరో హీరోయిన్‌గా చేసింది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 23న విడుదల కానుందీ చిత్రం.