UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం లో వచ్చేసిన రామ్ సేతు చిత్రం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదు. ఈ ఏడాది ఆయన నటించిన బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షా బంధన్ ఇలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇలాంటి సమయంలో దీపావళి కానుకగా ఆయన చేసిన రామ్ సేతు చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. యాక్షన్ అడ్వెంచర్‌గా అక్టోబరు 25న వచ్చిన ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్దగా ప్రభావం చూపనప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రామ్ సేతు చిత్రం విడుదలైంది. డిసెంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ చిత్రం ప్రైమ్‌లో చూడాలంటే రూ.199లు అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆడియోను ఇది ఎంపిక చేసుకోవచ్చు. ప్రైమ్ సబ్‌స్క్రైబర్లందరూ ఈ చిత్రాన్ని చూడాలంటే బహుశా మరో రెండు వారాలు టైమ్ పట్టవచ్చు. ఆ తర్వాత అందరూ వీక్షించే అవకాశముంది. ఈ విషయంపై సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline fernandez), నుష్రాత్ బరుచా కథానాయికలుగా నటించారు. టాలీవుడ్ హీరో సత్యదేవ్ (Satya Dev) రామ్ సేతు సినిమాలో కీలక పాత్రను పోషించారు. ఈ సినిమాతోనే అతడు బాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు. ఇందులో అక్షయ్ కుమార్ అర్కియాలజిస్ట్ క్యారెక్టర్ లో కనిపించారు. ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్‌కు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. అతడు నటించిన మూడు సినిమాలు ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో రామ్ సేతు రిజల్ట్ ఎలా ఉండబోతుందన్నది బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సెల్ఫీ, ఓ మై గాడ్ 2 తో పాటు సూరారై పోట్రు రీమేక్ లో నటిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !