UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 నిజానికి బండ్ల గణేశ్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని

బండ్ల గణేశ్ గురించి తెలుసు కదా. నిజానికి… కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బండ్ల గణేశ్. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి చివరకు నిర్మాతగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో తెలుసు కదా. గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేశ్ కెరీరే మారిపోయింది. నిజానికి బండ్ల గణేశ్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అందుకే పవన్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో.. బండ్ల గణేశ్ కు అంత ఫాలోయింగ్ ఉంది. పవన్ ను ఆయన ముద్దుగా దేవుడు దేవుడు అని పిలుస్తుంటాడు. ఆయన మాకు దేవుడు.. మేము ఆయన భక్తులం అని పవన్ ను ఉద్దేశించి బండ్ల గణేశ్ పలు సందర్భాల్లో చెప్పిన మాట తెలిసిందే కదా.బండ్ల గణేశ్ మాటలు చాలా వాక్చాతుర్యంతో కూడుకుంటాయి. ఆయన పలు యూట్యూబ్ చానెల్స్ లో ఇప్పటి వరకు ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసే ఉంటాం. తన మనసులో ఏది ఉంటే అది మాట్లాడుతారు గణేశ్.

అందుకే ఆయన్ను ముక్కుసూటి మనిషి అని అంటారు. ఆయన సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసినా కూడా అలాగే ఉంటుంది. తాజాగా ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తండ్రి మాట వింటే అల్లు బాబీలా అవుతారన్న బండ్ల గణేశ్ ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అల్లు బాబీ కొడుకు పెళ్లి హైదరాబాద్ లో జరగగా… పెళ్లికి బండ్ల గణేశ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు బాబీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేశ్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రి మాట వింటే సాదాసీదా జీవితంతో ఇదిగో ఇలా అల్లు బాబీ గారెలా ఉంటారు. కానీ.. తండ్రి మాట వినకపోతే అల్లు అర్జున్ లాగా పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ గా మారిపోతారు. కాబట్టి తండ్రి మాట ఎవ్వరూ వినకండి.. అంటూ బండ్ల గణేశ్ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

   TOP NEWS  

Share :

Don't Miss this News !