వైకాపా యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కర్నూలు లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా జరిగిన సభలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులు మరియు కార్యకర్తల సమక్షంలో బైరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గర్జన సభ వేదిక నుండి పిలుపునిచ్చారు. ఆ సమయంలోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వస్థ అస్వస్థతకు గురయ్యారు.
సభ వేదిక ముందు కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆయనకు వెంటనే పక్కన ఉన్న వైకాపా నాయకులు మరియు సన్నిహితులు సపర్యలు చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని పేర్కొన్నారు. పని ఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురయ్యారంటూ సన్నిహితులు చెప్తున్నారు. బైరెడ్డి ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయన నివాసంకు చేరుకున్నారు. ఏం జరిగిందో అంటూ ఆందోళనతో ఉన్న వారికి ఆయన కుటుంబ సభ్యులు బైరెడ్డి యొక్క యోగ క్షేమాలను తెలియజేసినట్లుగా సమాచారం అందుతోంది.