UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గర్జన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గర్జన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. రాయలసీమ మేధావులు మరియు ప్రజా సంఘాల సభ అన్నట్లుగా ప్రచారం జరిగినా కూడా పూర్తిగా వైకాపా శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు మరియు వైకాపా ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ను సక్సెస్ చేసేందుకు స్థానిక నేతలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు.

మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు అంతా కూడా ఈ మీటింగ్ కి హాజరు అవ్వాలి అంటూ వైకాపా నేతల నుండి సందేశాలు వెళ్ళాయట. డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు ఈ మీటింగ్ కి హాజరు కాకపోతే ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున ఫైన్ పడుతుంది అంటూ కూడా సంఘాల ప్రతినిధులకు మెసేజ్ లు వెళ్లాయి అంటూ విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని వైకాపా శ్రేణులు మాత్రం కొట్టి పారేస్తున్నారు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. రాయలసీమ గర్జన పార్టీలకు అతీతంగా జరిగింది అంటూ వైకాపా నాయకులు మరియు ఇతర సభ నిర్వాహకులు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

   TOP NEWS  

Share :

Don't Miss this News !