రష్యా అధ్యక్షుడు పుతిన్ తన నివాసంలో మెట్లు దిగుతుండగా జారిపడ్డారట. దీంతో తుంటి ఎముక విరిగి పోయిందని న్యూయార్క్ పోస్టు ఒక కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని సదరు కథనంలో పేర్కొన్నారు. తుంటి ఎముక దెబ్బతిన్న కారణంగా అతని ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతుందని అందులో రాసుకోచ్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. గతంలో కూడా పుతిన్ ఆరోగ్య విషయమై అంతర్జాతీయ మీడియా సంస్థలు పలు కథనాలను ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆయన ఆరోగ్య స్థితి మరింతగా క్షీణించిందని దారుణంగా ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచారం చేయడంతో రష్యాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ తో యుద్దం మొదలు అయిన సమయంలో పుతిన్ గురించి పెద్ద ఎత్తున అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం మొదలైంది. దాంతో ఆయన గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ సమయంలో ఆయన మెట్ల మీద నుండి జారి పడటం మరోసారి ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగేలా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాధినేతలతో పాటు పలువురు పుతిన్ ఆరోగ్య విషయమై ఎప్పటికప్పుడు ఎంక్వౌరీ చేస్తున్నారట. ఆయన ఆసుపత్రి నుండి ప్రస్తుతం పరిపాలన విధులు నిర్వహిస్తున్నారట.