UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్

అందం, అభినయంతో ప్రేక్షకులని అలరించే అందాల ముద్దుగుమ్ములు ఇటీవల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. చేతి నిండా సినిమాలు ఉన్నా, యాడ్స్ రూపంలో రూ. కోట్లలో డబ్బు సంపాదిస్తున్నా కూడా అరుదైన వ్యాధులతో మాటల్లో వర్ణించలేని బాధలు పడుతున్నారు. అలా ఇబ్బంది పడుతున్న వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార, ఇలియానా, పూనమ్ కౌర్, స్నేహా ఉల్లాల్, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దీపికా పదుకొనే తదితరులు ఉన్నారు. ఇక ఇటీవల సమంత గత కొన్నాళ్లుగా తను ‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పడంతో అందరు అవాక్కయ్యారు. ఎంతో యాక్టివ్‌గా ఉండే సమంతకి ఇలాంటి వ్యాధి రావడమేంటని చాలా బాధలో ఉన్నారు. సమంత ఆరోగ్య సమస్యపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇటీవల సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ షికార్లు చేయగా, సమంత ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు.

అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె వ్యక్తిగత టీమ్‌ కొట్టిపారేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రముఖ హాలీవుడ్ నటి కిర్ స్ట్రీ అల్లీ(71) కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ క్యాన్సర్ పై అలుపెరగని పోరాటం చేసి తాజాగా చివరిశ్వాస విడిచింది. samantha fans tensed Samantha : అభిమానులు ఆందోళన ఆమె కుమారుడు విలియం ట్రూ స్టీవెన్సన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు.కిర్ స్ట్రీ అల్లీ హాలీవుడ్ లో ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించారు. ”డ్రాప్ డెడ్ గార్జియస్”.. ”వెరోనికాస్ క్లోసెట్”.. ”ఇట్ టేక్స్ టూ” వంటి సినిమాల్లో ఉత్తమ నటనను కిర్ స్ట్రీ అల్లీ కనబర్చి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవడంతో పాటు ఆస్తులని బాగానే కూడబెట్టింది. కాని ఆమెకు వచ్చిన క్యాన్సర్ చివరకు ప్రాణం తీసింది. ఇప్పుడు సమంత వ్యాధి థర్డ్ స్టేజ్‌లో ఉండగా, సమంత పరిస్థితి ఏంటని అందరు ఆందోళన చెందుతున్నారు. సమంత వ్యాధికి నివారణ లేకపోవడంతో అభిమానులు చాలా ఆందోళనలో ఉ న్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !