బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా అనసూయ ఒకప్పుడు ఉండేది. జబర్దస్త్ మానేసిన అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతుంది. అయితే సోషల్ మీడియాలో అనసూయ పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు జబర్దస్త్ షో ని అనసూయ కోసమే చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆమె అందాల ప్రదర్శన కోసం షో మొదలయ్యే ముందు హార్ట్ పెర్ఫార్మెన్స్ కోసం జనాలు ఆరాటపడేవారు. దీంతో జబర్దస్త్ టీఆర్పి లు పెరిగిపోయాయి. ఇక ఆ తర్వాత మెల్లగా రష్మి రావడంతో అనసూయ గ్రాఫ్ కొంచెం తగ్గింది. అనసూయ ఏమాత్రం తన అందాలను దాచుకోకుండా ఎక్స్ప్రెస్ చేసి యువకుల మత్తులను పోగొట్టేది. కేవలం అందాల ప్రదర్శన కాదు నటనపరంగా కూడా అనసూయ మంచి మార్కులు వేయించుకుంది.
అయితే జబర్దస్త్ ను మెప్పిస్తున్న అనసూయ ఆకస్మాత్తుగా జబర్దస్త్ నుండి బయటికి వెళ్లిపోయింది. దానికి కారణం కూడా చెప్పుకొచ్చింది జబర్దస్త్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువ అయ్యాయని అవి వినలేకపోతున్నానని దాని కారణంగానే నేను జబర్దస్త్ను వదిలేస్తున్నాను అని స్పష్టత ఇచ్చింది.అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో అనసూయ అభిమానులతో చిట్ చాట్ చేసింది. మళ్లీ మీరు జబర్దస్త్ లోకి ఎప్పుడు వస్తారు జబర్దస్త్ లో మీ ప్లేస్ ఏంటి అని ప్రశ్నించాడు ఓ నెటిజన్. ఈ క్రమంలో అనసూయ మాట్లాడుతూ నా మనసులో జబర్దస్త్ కి ప్రత్యేక స్థానం ఉంది. కానీ కొన్నిసార్లు ఎక్కడ మీరు ఉండాలనుకుంటున్నారో అక్కడ అనుకోని పరిస్థితులు ఏర్పడతాయి. ఆ సమయంలో కష్టమైన సరే కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది. ఈ మాటలతో జబర్దస్త్ లోకి అనసూయ రాదు అని చెప్పేసింది. ప్రస్తుతం అనసూయ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.