UPDATES  

 ముందస్తుపై జగన్, చంద్రబాబులకు ప్రధాని మోదీ హెచ్చరికలు ..?

ఏపీలో ఇప్పుడు ముందస్తు ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే అధికార పార్టీ హడావుడి చేస్తోంది. సీఎం జగన్ పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ కీలక మార్పులు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో వర్క్ షాపులను నిర్వహిస్తున్నారు. ప్రజల్లో బలం లేని నాయకులను పక్కకు తప్పిస్తానని కూడా హెచ్చరికలు పంపుతున్నారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లను, జిల్లా పార్టీ అధ్యక్షులను పక్కకు తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. అటు ప్రధాన విపక్ష నేత సైతం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు. అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు. అచ్చం ఎన్నికల సభ మాదిరిగా చంద్రబాబు రోడ్ షోలు సాగుతున్నాయి. జనసేన సైతం వారానికి ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకొస్తోంది. అటు పవన్ సైతం త్వరలో గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లో పర్యటించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా అన్ని పార్టీల హైరానా చూస్తుంటే ముందస్తు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు ఢిల్లీలో జరుపుతున్న మంత్రాంగం కూడా ముందస్తుపై ఊహాగానాలను మరింత పెంచుతున్నాయి. Pawan Kalyan- PM Modi జీ20 శిఖరాగ్ర సమావేశ సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఒక కార్యక్రమం నిర్వహించింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపింది. అందులో భాగంగా అత్యున్నత సమావేశానికి జగన్, చంద్రబాబులు హాజరయ్యారు. ప్రధాని మోదీ నుంచి కేంద్ర పెద్దల వరకూ ఇద్దరు నేతలను బాగానే ఆదరించారు. అప్యాయంగా పలకరించారు. ప్రధాని మోదీ ఇద్దరి నేతల నుంచి ఏపీ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ప్రధాని వారికి కొన్ని సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చరన్న టాక్ నడుస్తోంది.

జగన్ సర్కారు ముందస్తుకు వెళ్లాలన్నా కేంద్రం అనుమతివ్వనిదే సాధ్యం కాదని తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని సీఎం జగన్ తో ఏం చెప్పారన్న దానిపై అంతటా చర్చ నడుస్తోంది. ప్రధాని విశాఖ పర్యటించే సందర్భంలో జనసేన అధినేత పవన్ కలిశారు. ఆ సమయంలో ప్రధాని రూట్ మ్యాప్ ఇచ్చారన్న ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే పవన్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. అప్పటివరకూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినివ్వనని చెప్పిన పవన్.. తనకు ఒక చాన్స్ ఇవ్వాలని కోరడం ప్రారంభించారు. టీడీపీతో కలిసి వెళదామని పవన్ కోరిన నేపథ్యంలో.. ప్రస్తుతానికి బీజేపీ, జనసేనలు కలిసి వెళ్లాలని.. చంద్రబాబు జనాల్లో బలం పెంచుకుంటే ఎన్నికల సమయంలో చూద్దామని అన్నట్టు కూడా టాక్ నడిచింది. అటు తరువాత ఏపీలో ఎవరికి వారు పార్టీల బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటువంటి తరుణంలో జగన్ ముందస్తుకు వెళతారని ఏపీలో ప్రచారం ఊపందుకుంది. Pawan Kalyan- PM Modi అయితే తాజాగా జగన్ ప్రధానిని కలిసిన తరుణంలో దీనికి ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది, ముందస్తుకు ప్రధాని ఒప్పుకోలేదని ప్రచారం సాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందస్తు అనేది జగన్ ఒక్కరికే అవసరం. ప్రస్తుతానికి ప్రభుత్వ వ్యతిరేకత తారస్థాయిలో ఉన్న క్రమంలో ఇది మరింత ఎక్కువవుతుందని భావించిన జగన్ ముందస్తుకు వెళితే వర్కవుట్ అవుతుందని భావించారు. కానీ ప్రధాని తిరస్కరించేసరికి మెత్తబడ్డారు. అయితే ప్రధాని పవన్ కు రూట్ మ్యాప్ ఇచ్చినందునా… అందుకు కొంత సమయం కావాల్సినందున ముందస్తుకు నో చెప్పారని ప్రచారం జరుగుతోంది. అటు చంద్రబాబు ప్రజల్లో బలం పెంచుకునేందుకు చాన్స్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. మొత్తానికి జగన్ ముందస్తు ఆశలపై ప్రధాని నీళ్లు చల్లారు. ఇప్పుడు జగన్ ముందున్న కర్తవ్యం తాను ప్రకటించిన పథకాలకు నిధులు సమకూర్చుకోవడం. లేకుంటే కేంద్రానికి ఎదురెళ్లి శాసనసభను రద్దు చేయడం. అయితే అంత సాహసానికి జగన్ ముందకొస్తారా? అన్నది అనుమానమే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !