UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 మొన్న ఢిల్లీలో.. నేడు విశాఖలో.. సైకో కిల్లర్.. భయానక స్టోరీ

శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ప్యాక్ చేశారు. డబ్బాలోపెట్టి చుట్టూ ప్లాస్టర్ అతికించారు. బయటకు దుర్వాసన రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నెలల తరబడి శవం అలానే కుళ్లి కృషించిపోయినా వాసన బయటకు రాలేనంతగా ఏర్పాట్లు చేశారు. సైకో కిల్లర్ తరహాలో ఓ ఘటన విశాఖలో బయటపడింది. భయానక స్థితిలో మహిళ మృతదేహం వెలుగుచూసింది. ఎప్పుడో నెలల కిందట జరిగిన హత్య ఉదాంతం.. అద్దె ఎగ్గొట్టడంతో ఇంటి ఓనర్ ఖాళీ చేయించే క్రమంలో బయటపడడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ అద్దెకు ఉన్న వ్యక్తే అసలు సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తూ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. అయితే కేసులో నిందితుడును గుర్తించిన పోలీసులు.. ఇప్పుడు హతురాలు ఎవరన్నది తేల్చే పనిలో ఉన్నారు.

Atrocity In Visakha పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన రిషి 2019లో ఉపాధి కోసం విశాఖ వచ్చాడు. ఎండాడ జంక్షన్ లో వెల్డింగ్ దుకాణం నడుపుతున్న రమేష్ ను పని కోసం ఆశ్రయించాడు. అక్కడే పనికి కుదిరిన రిషి కొద్దిరోజుల పాటు సవ్యంగానే నడుచుకున్నాడు. రిషిపై నమ్మకం కుదరడంతో కొమ్మాది వికలాంగ కాలనీలోని తన రేకుల షెడ్డును కొద్ది మొత్తం అద్దెతో రిషికి అప్పగించాడు రమేష్. అప్పటి నుంచి రిషి భార్యతో నివాసముంటున్నాడు. 2021 జూన్ లో భార్యను ప్రసవానికి పుట్టింటికి పంపించాడు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సదరు మహిళను ఎండాడలో ఇంటికి తీసుకొచ్చారు. ఇద్దరు శారీరకంగా కలిశారు. అయితే నగదు ఇచ్చుపుచ్చుకునే క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. శారీరక సంబంధాన్ని బయటకు చెప్పేస్తానని మహిళ బెదిరించడంతో రిషి చున్నీతో మెడను బిగించడంతో ఆమె అపస్మారకస్థితికి చేరుకుంది.

ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డ రిషి మహిళను హత్యచేశాడు. అంతటితో ఆగకుండా శరీరరాన్ని ముక్కలుగా చేసి ప్యాక్ చేశాడు. ఆ ప్యాక్ ను ఓ డబ్బాలో పడేసి దాని చుట్టూ ప్లాస్టర్ అతికించాడు. బయటకు దుర్వాసన రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ డబ్బాను ఇంట్లో ఓ మూలన పడేసి వెళ్లిపోయాడు. Atrocity In Visakha అయితే అటు వెల్డింగ్ షాపునకు వెళ్లడం మానేశాడు రిషి. దీంతో రమేష్ తరచూ ఫోన్ చేసినా ఏవేవో కథలు చెబుతూ తప్పించుకొని తిరిగే వాడు. నెలల తరబడి అద్దె సైతం చెల్లించలేదు. ఇటీవల ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేశాడు. దీంతో వెరొకరికి అద్దెకిచ్చేందుకు రమేష్ నిర్ణయించుకున్నాడు. షెడ్ లో ఉన్న రిషి లగేజీ ఖాళీ చేయించాడు. ఈ క్రమంలో డబ్బా కనిపించింది. తెరిచి చూడగా ముక్కముక్కలుగా ఉన్న మృతదేహం బయటపడింది.

దీంతో రమేష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో రిషి అనే వ్యక్తి ఉండేవాడని చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. రిషిని అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేయగా.. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. కానీ ఆమె ఎవరనేది మాత్రం చెప్పలేకపోతున్నాడు. ప్రయాణంలో పరిచయమైనట్టు మాత్రమే చెబుతున్నాడు. అయితే రిషికి, అపరిచిత మహిళ మధ్య రెండుసార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కానీ ఎక్కువ రోజులు కావడంతో ఫోన్ కాల్ డేటాలో సైతం ఎటువంటి వివరాలు లభ్యం కావడం లేదు. దీంతో సదరు మహిళ ఎవరనేది పోలీసులకు అంతుపట్టడం లేదు. మిస్టరీని ఛేదించే పనిలో ప్రస్తుతం విశాఖ పోలీసులు ఉన్నారు. మొన్న ఢిల్లీలో ప్రేమోన్మాదంతో మహిళను ముక్కలు ముక్కలుగా నరికిన ఘటన మరువక ముందే.. విశాఖలో అటువంటి ఘటనే వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !