UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీ దూకుడు

తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ప్రధాని నరేద్రమోదీ దర్యాప్తు సంస్థలతో సాగిస్తున్న ఆధిపత్య పోరులో కేసీఆర్‌ ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌) తెలిపోతోంది. అదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీ దూకుడు పెంచుతున్నాయి. కోర్టులోనూ సిట్‌కు ఎదురుదెబ్బలు తగులుతుండం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. మోదీతో ఎందుకు పెట్టుకున్నామా అన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేసుకుని మోదీ చేస్తున్న దాడి రోజురోజుకూ పెరుగుతోంది. దీని ప్రభావం ఇప్పుడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అదికార వైసీపీపైనా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ కేంద్రం దర్యాప్తు సంస్ధల్ని ప్రయోగిస్తున్న తీరు ఇటు గులాబీ నేతలతోపాటు అటు వైసీపీ నేతలనూ చికాకు పోడుతోంది.

లిక్కర్‌ స్కాంతో మొదలైన మోదీ దాడి.. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ వరకూ వచ్చేసింది. దీంతో హైదరాబాద్‌ కేంద్రంగా ఇన్నాళ్లూ సేఫ్‌గా వ్యాపారాలు చేసుకుంటున్న ఏపీ నేతలూ ఇరుకున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. Modi vs Kcr ముదురుతున్న ఆధిపత్య పోరు.. తెలంగాణలో బీజేపీ వర్సెస్‌ కేసీఆర్‌ రాజకీయం అంతకంతకూ ముదురుతోంది. ఇప్పటికే ఇటు కేసీఆర్, అటు బీజేపీ వరుస ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. ఈ రాజకీయంలో భాగంగా మునుగోడు ఉపఎన్నికను జనంపైకి రుద్దిన బీజేపీ… అక్కడ టీఆర్‌ఎస్‌ గెలవడంతో పునరాలోచనలో పడింది. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీకి సన్నిహితులైన స్వాములు సాగించిన బేరసారాల్ని పోలీసుల సాయంతో పట్టుకున్న టీఆర్‌ఎస్‌.. వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టలేకపోయింది.

ఇదే అదనుగా ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ కుమార్తె కవితతోపాటు ఆ పార్టీకి సన్నిహితంగా ఉంటున్న పలువురిని కేంద్రం దర్యాప్తు సంస్థల సాయంతో టార్గెట్‌ చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు.. కేసీఆర్‌ను టార్గెట్‌ చేసే క్రమంలో టీఆర్‌ఎస్‌ నేతల చుట్టూ ఉన్నవారి ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇన్నాళ్లూ టీఆర్‌ఎస్‌కు ఆర్థ్ధికంగా అండదండలు అందించిన హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మాఫియాతోపాటు ఢిల్లీ లిక్కర్‌ స్కాం సిండికేట్లను కేంద్రం కదిపింది. వీరిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీతోపాటు ఐటీని కూడా ప్రయోగిస్తోంది. ఆయా సంస్థల దాడులతో లిక్కర్‌ స్కాం, రియల్‌ ఎస్టేట్‌ అక్రమాలన్నీ బయటికి వస్తున్నాయి.

ఇందులో టీఆర్‌ఎస్‌ నేతల పాత్ర బయటపడుతుండటంతో ఆ పార్టీ ఇరుకునపడుతోంది. వైసీపీ నేతలు, సన్నిహితులపైనా ? టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్న కేంద్రం ఇప్పుడు వారితో కుమ్మక్కు కావడమో లేక లావాదేవీలు, సంబంధాలు నెరుపుతున్న వైసీపీ నేతల్ని సైతం వదిలిపెట్టడం లేదు. జగన్‌తో కేంద్రం సత్సంబంధాలు నెరుపుతున్నా.. ఆ పార్టీ నేతల విషయంలో మాత్రం రాజీపడటం లేదు. దీంతో లిక్కర్‌ స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేర్లు బయటికి వచ్చాయి. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన శరత్‌ చంద్రారెడ్డి, ఆయన భార్య పేర్లు కూడా వచ్చాయి.. అలాగే మంగళవారం వంశీరామ్‌ బిల్డర్స్‌ పై ఐటీ దాడులు విజయవాడలోని వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీని కూడా చుట్టుకున్నాయి.దీంతో వైసీపీ నేతలు బెంబేలెత్తుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !