UPDATES  

 11న MLC కవితను విచారించనున్న CBI.!

నేడే సీబీఐ ముందుకు ఎమ్మెల్యే కవిత వెళ్ళి వుండాల్సింది. కాదు కాదు, ఆమె ఇంటికే సీబీఐ వెళ్ళి విచారణ చేసి వుండాల్సింది.! కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కవిత.. తనకు కొంత గడువు కావాలని సీబీఐని అభ్యర్థించారు. దాంతో, సీబీఐ ఆమె అభ్యర్థనను మన్నించక తప్పలేదు. ఈ నెల 11న అందుబాటులో వుండాలంటూ సీబీఐ నుంచి సమాచారం వెళ్ళింది ఎమ్మెల్సీ కవితకి. ఈ నెల 11న ఉదయం 11 గంటల సమయంలో హైద్రాబాద్‌లోని కవిత ఇంటికి సీబీఐ అధికారులు వెళ్ళనున్నారు.

మెయిల్ ద్వారా సమాచారమిచ్చిన సీబీఐ.. నేడు విచారణకు హాజరు కాలేననీ, మరో తేదీ చెప్పాలంటూ సీబీఐని కోరుతూ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. దాంతో, కవిత పేర్కొన్న తేదీల్లోని 11వ తేదీని సీబీఐ ఖరారు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి సీబీఐ ఈ విచారణ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా, నేడు సీబీఐ యెదుట కవిత విచారణకు హాజరవుతారన్న ప్రచారంతో కవిత నివాసానికి పెద్దయెత్తున గులాబీ శ్రేణులు చేరుకున్నాయి. అయితే, అనూహ్యంగా విచారణ మరో తేదీకి వెళ్ళింది. అయినా, సాక్షిగానే తనను సీబీఐ పిలిచిందనీ, అరెస్టు చేసుకున్నా ఇబ్బంది ఏమీ లేదని మీడియా ముందు ఘనంగా చెప్పుకున్న కవితే, విచారణ తేదీని వెనక్కి ఎందుకు నెట్టాలనుకున్నట్టు.?

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !