UPDATES  

 MEGASTAR సినిమా అప్‌డేట్‌ ఇచ్చిన తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా ఎట్టకేలకు ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఇటీవల సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా పలు మీడియా సంస్థలకు సినిమా విశేషాలను తెలియజేసేందుకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా తన తదుపరి సినిమాల గురించి క్లారిటీ ఇచ్చింది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నట్లుగా పేర్కొంది. ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమంలో ఇప్పటి వరకు జాయిన్ అవ్వలేదని వచ్చే నెల నుండి ఆ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలకు హాజరు కాబోతున్నట్లుగా తమన్నా పేర్కొంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ తమన్నా మాత్రం ఇప్పటి వరకు తాను షూటింగ్ లో జాయిన్ కాలేదు అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. అంటే చిరంజీవి సినిమా భోళా శంకర్ పూర్తి అవడానికి చాలా సమయం పడుతుందని దీన్ని బట్టి అర్థం అవుతుంది. సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !