చాలామంది మా హీరోలు గొప్ప అంటే మా హీరోలు గొప్ప అంటూ గొడవ పడుతుంటారు.ఇలాంటి ఫ్యాన్ వార్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఈ ఫ్యాన్ వార్ అనేది ఇప్పటిది కాదు ఎన్టీఆర్ ఏ ఎన్ ర్ కాలం నాటి నుండి వస్తూనే ఉంది. ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ శోభన్, శోభన్ బాబు , కృష్ణంరాజు వీళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ , నాగార్జున , విక్టరీ వెంకటేష్ ఇక ప్రస్తుతం ప్రభాస్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ , ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా చాలామంది హీరోల ఫ్యాన్స్ మధ్య పోటీ అనేది ఉంటూనే ఉంటుంది. అయితే తాజాగా సంక్రాంతికి బాలకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి తమ సరికొత్త సినిమాలతో పోటీ పడబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఇద్దరు హీరోలలో ఎవరు గొప్ప అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతుంది.ఇక ఈ విషయమై తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ గీతాకృష్ణ మాట్లాడుతూ…చిరంజీవి కంటే బాలకృష్ణ గొప్ప అని ఎవడ్రా అనేది…బాలయ్య గురించి సంచలన కామెంట్స్ చేసిన టాప్ డైరెక్టర్.!
చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి మెగాస్టార్ గాఎదిగాడు, బాలకృష్ణ మాత్రం తన తండ్రి పేరు చెప్పుకొని వచ్చారని ఇంకా ఈ మధ్యకాలం ఒకటో రెండో చిరంజీవి సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన , చిరంజీవి గారి ఇమేజ్ ఏం తగ్గదంటూ చెప్పుకోచింది. డైరెక్టర్ వలన బాలకృష్ణ రెండు సినిమాలు హిట్ అయితే చిరంజీవి Star director geetha krishna made a words on Balakrishna కంటేే ఎక్కువ అయిపోతాడా అసలు చిరంజీవి రెంజ్ బాలకృష్ణ ఎప్పుడు చేరుకోలేడు అంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం బాలకృష్ణ టైం బాగుంది కాబట్టి వరుసగా సినిమాలు హిట్ అవుతున్నాయి.అలానే ఏదో ఒకరోజు చిరంజీవికి కూడా అవకాశం లభిస్తుందని ఒకవేళ హిట్ కాకపోయినా ఏం పర్లేదు ఎందుకంటే చిరంజీవి రేంజ్ ఏంటో అందరికీ ఆల్రడీ తెలుసు అని చెప్పింది. ఇక ఇవన్నీ నేను బాలకృష్ణ అభిమానులను కించపరిచేల అయితే మాట్లాడడం లేదని సాధారణంగా చెబుతున్నాను అంటూ గీత కృష్ణ చెప్పుకొచ్చారు. అయితే గీతాకృష్ణ మాట్లాడిన విధానం చూస్తుంటే కావాలని బాలకృష్ణని టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తుంది. దేంతో ప్రస్తుతం గీతాకృష్ణ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.